సాక్షి, అమరావతి: తిరుమల ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రకటనల ముద్రణ వ్యవహారంపై తక్షణ విచారణకు ఆదేశించినట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఆ టికెట్లు టీడీపీ హయాంలోనే ముద్రించినట్టు తేలిందని.. ఎన్నికలకు ముందు ఆ టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందని పేర్కొన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన ఆ టికెట్లు తిరుపతి డిపోకు వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారని.. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. మతపరంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం, సంబంధిత వ్యక్తులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని మంత్రి ఆరోపించారు. దురుద్దేశపూర్వక ప్రచారం ద్వారా శ్రీవారి భక్తుల మనసులను గాయపరిచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కొన్ని టీవీ చానళ్లు, వ్యక్తులు ఈ వ్యవహారాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన అంశాల్లో ప్రభుత్వానికి లేని దురుద్దేశాలను అంటగట్టి విష ప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా?
హిందుత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా అని వెలంపల్లి ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే గతంలో 40 ఆలయాలను కూలగొట్టారన్నారు. సదావర్తి సత్రం భూములు కాజేయాలని చూసింది, కనకదుర్గమ్మ గుడిలో, శ్రీకాళహస్తి ఆలయంలో క్షుద్ర పూజలు చేయించింది, దుర్గమ్మ భూముల్ని తన వారికి అతి తక్కువ ధరకే లీజుకిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు కలియుగ దైవానికి సంబంధించిన బంగారాన్ని లారీల్లో తరలించటం వరకు దుర్మార్గాలూ చేశారు కాబట్టే ఆ దేవుడి ఆగ్రహానికి గురయ్యారన్నారు. వీటిలో చాలా దుర్మార్గాలు జరిగిన సమయంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నది మాణిక్యాలరావేనని, ఆయన కూడా ఇవే మాట్లాడుతున్నారని తప్పుపట్టారు.

అది టీడీపీ ప్రభుత్వ తప్పిదమే : మంత్రి పేర్ని
మచిలీపట్నం టౌన్: తిరుమల టిక్కెట్లపై అన్యమత ప్రకటనల వ్యవహారం గత టీడీపీ ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ టిక్కెట్లకు ఉపయోగించే పేపర్ రోల్ వెనుక జెరూసలెం, మక్కా యాత్రలకు సంబంధించి మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రకటన ముద్రించిందని తెలిపారు. దానిని తిరుమల బస్సులో ఓ కండక్టర్ వినియోగించారన్నారు. ఈ విషయం గురువారం ఉదయం 11 గంటలకు తన దృష్టికి రాగా.. వెంటనే ఆ రోల్‌ను వినియోగించకుండా నిలిపివేశామన్నారు. గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేందుకు టికెట్ రోల్స్‌పై వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రకటనలు ముద్రించిందని తెలిపారు. దానిని కిందిస్థాయి ఉద్యోగి కండక్టర్‌కు పొరపాటున ఇవ్వటం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. ఇవేమీ తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు కావని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఉన్న ఓ రోల్‌ను ఆర్టీసీ సిబ్బంది ఏమరుపాటుగా వినియోగించడాన్ని రాద్ధాతం చేయడం తగదన్నారు. రాజకీయాల కోసం మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకోవటం దురదృష్టకరం, దిగజారుడు తనమని పేర్కొన్నారు. దీనిని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారంతా ఆపాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment