rtc bus tickets
-
టీడీపీ హయాంలోనే ఆ టికెట్ల ముద్రణ
సాక్షి, అమరావతి: తిరుమల ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రకటనల ముద్రణ వ్యవహారంపై తక్షణ విచారణకు ఆదేశించినట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఆ టికెట్లు టీడీపీ హయాంలోనే ముద్రించినట్టు తేలిందని.. ఎన్నికలకు ముందు ఆ టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందని పేర్కొన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన ఆ టికెట్లు తిరుపతి డిపోకు వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారని.. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. మతపరంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని సీఎం జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం, సంబంధిత వ్యక్తులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని మంత్రి ఆరోపించారు. దురుద్దేశపూర్వక ప్రచారం ద్వారా శ్రీవారి భక్తుల మనసులను గాయపరిచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కొన్ని టీవీ చానళ్లు, వ్యక్తులు ఈ వ్యవహారాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన అంశాల్లో ప్రభుత్వానికి లేని దురుద్దేశాలను అంటగట్టి విష ప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా? హిందుత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా అని వెలంపల్లి ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే గతంలో 40 ఆలయాలను కూలగొట్టారన్నారు. సదావర్తి సత్రం భూములు కాజేయాలని చూసింది, కనకదుర్గమ్మ గుడిలో, శ్రీకాళహస్తి ఆలయంలో క్షుద్ర పూజలు చేయించింది, దుర్గమ్మ భూముల్ని తన వారికి అతి తక్కువ ధరకే లీజుకిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు కలియుగ దైవానికి సంబంధించిన బంగారాన్ని లారీల్లో తరలించటం వరకు దుర్మార్గాలూ చేశారు కాబట్టే ఆ దేవుడి ఆగ్రహానికి గురయ్యారన్నారు. వీటిలో చాలా దుర్మార్గాలు జరిగిన సమయంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నది మాణిక్యాలరావేనని, ఆయన కూడా ఇవే మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా? హిందుత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా అని వెలంపల్లి ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే గతంలో 40 ఆలయాలను కూలగొట్టారన్నారు. సదావర్తి సత్రం భూములు కాజేయాలని చూసింది, కనకదుర్గమ్మ గుడిలో, శ్రీకాళహస్తి ఆలయంలో క్షుద్ర పూజలు చేయించింది, దుర్గమ్మ భూముల్ని తన వారికి అతి తక్కువ ధరకే లీజుకిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు కలియుగ దైవానికి సంబంధించిన బంగారాన్ని లారీల్లో తరలించటం వరకు దుర్మార్గాలూ చేశారు కాబట్టే ఆ దేవుడి ఆగ్రహానికి గురయ్యారన్నారు. వీటిలో చాలా దుర్మార్గాలు జరిగిన సమయంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నది మాణిక్యాలరావేనని, ఆయన కూడా ఇవే మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. అది టీడీపీ ప్రభుత్వ తప్పిదమే : మంత్రి పేర్ని మచిలీపట్నం టౌన్: తిరుమల టిక్కెట్లపై అన్యమత ప్రకటనల వ్యవహారం గత టీడీపీ ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ టిక్కెట్లకు ఉపయోగించే పేపర్ రోల్ వెనుక జెరూసలెం, మక్కా యాత్రలకు సంబంధించి మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రకటన ముద్రించిందని తెలిపారు. దానిని తిరుమల బస్సులో ఓ కండక్టర్ వినియోగించారన్నారు. ఈ విషయం గురువారం ఉదయం 11 గంటలకు తన దృష్టికి రాగా.. వెంటనే ఆ రోల్‌ను వినియోగించకుండా నిలిపివేశామన్నారు. గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేందుకు టికెట్ రోల్స్‌పై వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రకటనలు ముద్రించిందని తెలిపారు. దానిని కిందిస్థాయి ఉద్యోగి కండక్టర్‌కు పొరపాటున ఇవ్వటం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. ఇవేమీ తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు కావని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఉన్న ఓ రోల్‌ను ఆర్టీసీ సిబ్బంది ఏమరుపాటుగా వినియోగించడాన్ని రాద్ధాతం చేయడం తగదన్నారు. రాజకీయాల కోసం మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకోవటం దురదృష్టకరం, దిగజారుడు తనమని పేర్కొన్నారు. దీనిని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారంతా ఆపాలని హితవు పలికారు. -
అది పచ్చ ముద్రణే!
సాక్షి, అమరావతి: తప్పు చేయడం, దానిని ఎదుటివారిపై రుద్ది విమర్శలు గుప్పించడం తెలుగుదేశం నాయకులకు బాగా తెలిసిన విద్య. ఆర్టీసీ బస్సు టికెట్ల వెనుక ప్రకటనల ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణ. ఆ టికెట్లను తెలుగుదేశం హయాంలోనే ముద్రించారు. అలా ముద్రించేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇపుడు అవే టిక్కెట్లను చూపిస్తూ పవిత్ర క్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిపోతున్నదని రాష్ట్రప్రభుత్వంపై విషప్రచారానికి దిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆ టికెట్లు ముద్రితమయ్యాయన్న విషయం సాక్ష్యాలతో సహా బైటపడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తామే చేయాల్సిందంతా చేసి ఇపుడు తీరిగ్గా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించేందుకు తెలుగుదేశం నాయకులు కుట్రలు పన్నడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ముస్లింలు, మైనార్టీలకు అమలు చేసిన పథకాల వివరాలను ఆ టిమ్ రోల్స్‌పై ముద్రించారు. టీడీపీ హయాంలోనే వీటిని ముద్రించారనేందుకు ఆ పథకాలే ప్రత్యేక ఆధారాలు. పైగా ఈ ఏడాది మార్చిలో ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినా దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు కొత్త ప్రభుత్వంపై దుష్ప్రచారాలకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దీనిపై నిజాలు వెల్లడించాలి్సన ఆర్టీసీ ఉన్నతాధికారులు 36 గంటలపాటు మీనమేషాలు లెక్కించడంపైనా విస్మయం వ్యక్తమవుతోంది. బస్ టికెట్ల వెనుక ప్రచారం నిమిత్తం 5 మార్చి 2019న ఇచ్చిన ఆదేశాలు బాబు సీఎంగా ఉన్నప్పుడే ముద్రణ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్టీసీ బస్ టిక్కెట్లు జారీ చేసే టిమ్ రోల్స్ వెనుక భాగంలో టీడీపీ సర్కారు పథకాలతో పాటు జెరూసలేం, హజ్ యాత్రలకు సంబంధించిన ప్రచారాంశాలను ముద్రించారు. కోయంబత్తూర్‌కు చెందిన ‘పర్ఫెక్ట్ కోటెడ్ పేపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు వీటికి సంబంధించిన టిమ్ రోల్స్ సరఫరాకు ఈ ఏడాది మార్చి 5న ఆర్డర్ ఇచ్చారు. నెల్లూరు, కడప జోన్లలో 60,000 రోల్స్ సరఫరాకు గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం కుదిరింది. రోల్స్ వెనుక భాగంలో చంద్రబాబు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యాడ్స్, ముద్రణ బాధ్యతలను ‘మార్విన్ క్రియేటివ్ సర్వీసెస్’ యాడ్ ఏజెన్సీ’కి అప్పగించారు. 2016 నుంచి 2019 వరకు ప్రకటనల సేకరణ కాంట్రాక్టు మార్విన్ క్రియేటివ్ సంస్ధకు ఉంది. టిమ్ రోల్స్ సరఫరా, ప్రకటనల సేకరణ కోసం పర్ఫెక్ట్ కోటెడ్ పేపర్స్, మార్విన్ క్రియేటివ్ సంస్ధలకు కాంట్రాక్టు ఇచ్చింది గత ప్రభుత్వమే కావడం గమనార్హం. టీడీపీ హయాంలో మైనార్టీ శాఖ నుంచి సేకరించిన ఈ ప్రకటనలను నెల్లూరు, కడప జోన్ల వరకు ముద్రించడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జోన్ పరిధిలోనే తిరుపతి, తిరుమల డిపోలున్నాయి. మైనార్టీ శాఖ నుంచి జెరూసలేం, హజ్ యాత్రల ప్రచారాన్ని నెల్లూరు జోన్‌కు కేటాయించారంటే కచ్చితంగా తిరుపతి, తిరుమలకు టిమ్ రోల్స్ సరఫరా అవుతాయని ఊహించే బురద చల్లే యత్నాలకు ఉపక్రమించారని బోధపడుతోంది. పాత రోల్స్‌ను పంపిన అధికారులు.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే చంద్రబాబు సర్కారు పథకాల ప్రచారంతో కూడిన టిమ్ రోల్స్‌ను నిలిపేశారు. మే 30వతేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటికే ముద్రించి సరఫరా చేయకుండా ఉన్న టిమ్ రోల్స్‌ను జూన్ 18న అధికారులు నెల్లూరు, కడప జోన్లకు పంపించారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజుల తర్వాత కూడా కొందరు అధికారులు గత సర్కారు ముద్రించిన ప్రచార టికెట్లను పంపిణీ చేయడం గమనార్హం. ఆర్టీసీలో కొందరు అధికారులు రెండు రోజుల పాటు నిర్లిప్తంగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు యత్నించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్ టిక్కెట్ల రోల్‌పై ప్రకటనల సమాచారాన్ని ఆర్టీసీ చీఫ్ కంట్రోల్ ఆఫ్ స్టోర్స్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రింటింగ్‌కు పంపించాలి. అయితే ఆర్టీసీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా టిక్కెట్ టిమ్ రోల్స్‌ను తిరుపతి, తిరుమలకు పంపించారు. మైనార్టీ శాఖ ప్రకటనలివ్వడంతోనే పరిశీలించలేదు: ఈడీ కోటేశ్వరరావు ఆర్టీసీ టిమ్ రోల్స్ వెనుక భాగంలో మైనార్టీ శాఖ ప్రకటనలివ్వడంతోనే తాము పరిశీలించలేదని ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచారం ఘటనపై ఆర్టీసీకి ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబు సర్కారు పథకాలను ప్రచారం చేయడం, ముఖ్యమంత్రిగా ఎవరున్నారనే విషయం ఆర్టీసీకి తెలియదా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం.. తిరుమల గిరుల పవిత్రతను పరిరక్షిస్తూ భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గంలో ఎక్కడా మద్యం షాపులు ఉండరాదని ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టింది. దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు హయాంలో ముద్రించిన అన్యమత ప్రచారం టికెట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అంటగడుతూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ఇందుకు కొందరు అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
ఆర్టీసీకి పండుగ, ప్రయాణికులకు మోత
అమరావతి : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పట్నం బస్సులన్నీ పల్లెకు పరుగుతీస్తాయి. డిమాండ్‌ని బట్టే ధర అన్నట్లు... బస్సు ఛార్జీలకు ఉన్నట్టుండి రెక్కలొచ్చేశాయి. ప్రజా శ్రేయస్సు అని చెప్పుకునే ఆర్టీసీ కూడా... ట్రావెల్స్‌కు ఏమాత్రం తగ్గకుండా టిక్కెట్ చార్జీలను వసూలు చేస్తోంది. సంక్రాంతి పండగకు రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి 2,500 ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసినట్లు ఆర్భాటంగా ప్రకటించిన ఆర్టీసీ... 50 శాతం అదనపు ఛార్జీలతో పాటు రిజర్వేషన్ చార్జీలు తదితరాలన్నీ కలిపి 75 శాతం వరకు అదనంగా టిక్కెట్ ధరపై వసూలు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 17 వరకు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం ద్వారా రిజర్వేషన్లు అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ఫ్లెక్సీ ఫేర్ విధానంలో ప్రయాణికుల నుంచి దోచుకున్న ఆర్టీసీ సంక్రాంతి పండక్కి ప్రత్యేక బాదుడుకు తెగబడింది. అదనంగా చార్జీలు వసూలు చేయబోమని రవాణ శాఖ మంత్రి ప్రకటించినా దాంతో తమకు సంబంధం లేదని, బాదుడు బాదుడేనని ఆర్టీసీ స్పష్టం చేస్తోంది. దీంతో ఆర్టీసీ బాదుడు చూసి ప్రైవేట్ ఆపరేటర్లు మరింత రెచ్చిపోతున్నారు. టిక్కెట్ ధరపై 200 నుంచి 300 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టిక్కెట్ల ధరలు పెంచకుండా నియంత్రిస్తామని, టిక్కెట్ల ధరలు పెంచితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇటీవలే మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తనిఖీల పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ జోలికెళ్లొద్దని రవాణా శాఖ అధికారులకు సర్కారు నుంచి మౌఖిక ఆదేశాలందినట్లు సమాచారం. పండగ సీజన్లో ప్రైవేట్ ట్రావెల్స్‌పై తనిఖీలు చేస్తే... అంతిమంగా ప్రయాణికులే ఇబ్బందులకు గురవుతారని, ప్రయాణానికి ఆటంకాల్లేకుండా చూడాలని సర్కారు పెద్దల ఆదేశాలు ఉన్నాయట. దీంతో సాధారణ ధరలు కూడా రెట్టింపైపోయి ప్రయాణికులను వణికిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ టిక్కెట్ ధర సాధారణంగా రూ.300 వరకు ఉంటే, ప్రస్త్తుతం ప్రైవేటు ట్రావెల్స్ రూ.700 నుంచి రూ.900 వరకు వసూలు చేస్తున్నాయి. తిరుపతికి రూ.1,700 వరకు దోచేస్తున్నాయి. ఇదిలాఉండగా తాజాగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు కొత్త ఎత్తుగడ వేశారు. ఆయా జిల్లాల్లో రవాణా శాఖకు టూరిస్ట్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. బస్సులో 42 సీట్లుంటే టికెట్ల ధరలను ఆన్లైన్లో ఉంచి ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నారు. సర్కారే వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుంటే... ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. సంక్రాంతి సీజన్లో ప్రయాణికుల నుంచి అదనంగా రూ.20 కోట్ల మేర వసూలు చేసేందుకు ఆర్టీసీ టార్గెట్ పెట్టుకోవడం గమనార్హం.