సాక్షి, అమరావతి : చంద్రబాబు, ఆయన శిష్య గణానికి ప్రతిదీ నెగెటివ్‌గా కనిపించడానికి ‘రిటైర్మెంట్ సిండ్రోమ్’ కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించిన వారంతా అదృశ్యమవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదవులు పోవడం, ప్రజలు తనను పట్టించుకోకపోవడం వల్లే చంద్రబాబు ఇలా ప్రవరిస్తున్నారంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఏదేదో ట్వీటుతున్నాడు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ తీరును ఎంపీ విజయసాయిరెడ్డి ఎండగట్టారు. చిత్తుగా ఓడి కూడా ‘హింసించే రాజు 23వ పులకేశి’ లాగా లోకేశ్ ప్రజలను టార్చర్ చేస్తున్నాడని తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ‘ఎన్నికలప్పుడు చేసిన చవకబారు విమర్శలనే మళ్లీ వదులుతున్నాడు. చంద్రబాబు కొడుకు కాబట్టి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రిగా మూడు శాఖలను భ్రష్టు పట్టించాడు. కీచురాళ్ల రొద లాగా ఇప్పుడు ఏదేదో ట్వీటుతున్నాడు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment