
సాక్షి, అమరావతి : ప్రజల వేళ్లపై పోలింగు రోజు వేసిన సిరా మరక ఇంకా చెరగకముందే...గుండెలు బాదుకునే బ్యాచ్ వీధుల్లోకి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళగిరి ప్రజలు పొర్లించి కొట్టిన మాలోకానికి కాస్త వేచి చూడాలన్న స్పృహ కూడా లేదని.. ఆయన అప్పుడే ఏడుపు లంకించుకున్నాడని ఎద్దేవా చేశారు. అవినీతి లేని రాష్ట్రంగా ఏపీకి కొత్త ఇమేజి తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటే పచ్చ పార్టీ నేతలు మాత్రం పరిశ్రమలు రావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు... ఆ అవినీతి లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
80 శాతం హామీలు నెరవేర్చారు..
ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీల్లో 80 శాతం నెరవేరేందుకు అనుగుణంగా తమ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే కేటాయింపులు జరిపిందని విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అర్హులందరూ నవరత్నాల ద్వారా లబ్ది పొందేలా చూస్తామని పేర్కొన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ప్రతిపక్షనేతగా పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment