సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ తెలివి 8వ తరగతి పిల్లాడికి మించదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లతో తండ్రి,కొడులకులపై మండిపడ్డారు. మానసిక పరిణితి, తెలివి నిర్ధారించడానికి ఐక్యూ పరీక్షలు ఉంటాయని, మంత్రి లోకేశ్ ఐక్యూ లెవల్ 8 వ తరగతి పిల్లాడికి మించదన్నారు. తండ్రి దోచుకున్న సంపద లేక పోతే పప్పునాయుడుకి కనీసం రూ.10 వేల జీతమిచ్చేజాబ్ కూడా దొరికేది కాదన్నారు. లోకేశ్‌ను ఏదైనా ఒక జిల్లాలోని అసెంబ్లీ స్థానాల పేర్లు చెప్పమనండని ప్రశ్నించారు.
ఉమమహేశ్వర్ రావు అనే అసమర్థ మంత్రికి ఎప్పుడూ పీడ కలలే వస్తుంటాయని, రాజధాని ఇడుపులపాయకు తరలిపోతుందనే కొత్త కల కన్నాడని ఎద్దేవా చేశారు. అసలు మీ ప్రభుత్వం రాజధాని కడితే గదా ఇంకొకరు మార్చేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. గ్రాఫిక్స్ భ్రాంతిలోనుంచి ఉమా బయటకు రావాలని సూచించారు. చంద్రబాబు డేటా చోరీ స్కాం దేశంలోనే పెద్ద సైబర్ సాబోటేజ్ క్రైమని, రహస్య సమాచారాన్ని బజారులో పడేశారని ధ్వజమెత్తారు. ఇంకా ఏయే వ్యవస్థల్లోకి చొరబడ్డారో తేల్చలని డిమాండ్ చేశారు. దొంగిలించిన సమాచారంతో ఏపీ ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఏర్పడిందని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కుప్పకూల్చారని మండిపడ్డారు.
చంద్రబాబు.. రాజకీయ పోరాటం వదిలి ప్రజలపై కసి తీర్చుకుంటున్నాడని,. మామను వెన్ను పోటు పొడిచి అధికారం లాక్కున్నాడన్నారు. ఇప్పుడు ప్రజల డేటాను దొంగిలించి వారి సర్వస్వం దోచుకునే ప్లాన్ వేశాడని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో బొటాబొటి గెలుపు పైనా కూడా తమకు అనుమానం కలుగుతోందని, ఎలక్షన్ కమిషన్ దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment