
సాక్షి, అమరావతి : భూముల ధరలు ఆకాశాన్ని తాకాలనే వ్యాపార బుద్ధితో చంద్రబాబు నాయుడు అమరావతిని ఐదేళ్లపాటు అలా వదిలేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజధాని అంశం గురించి చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వర్షాలు కురిస్తే జలపాతాలు కనువిందు చేసే నాలుగు తాత్కాలిక భవనాలు కట్టించి అమరావతిని హత్య చేశారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచించి అమరావతిని గాలికొదిలేసిన చంద్రబాబు ఈరోజు.. బంగారు బాతును చంపేశారు అంటూ విలపిస్తున్నారు అని దుయ్యబట్టారు. ఆ పాపం అంతా చంద్రబాబుదేనని పేర్కొన్నారు.
తిండే ఆ స్థాయిలో ఉందా?
విశాఖ ఎయిరుపోర్టులో చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ స్నాక్స్ ఖర్చు రూ.25 లక్షలట అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ మొత్తంతో వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామం నెల రోజులు గడుపుతుందని పేర్కొన్నారు. నిజంగా నారా లోకేశ్ తిండే ఆ స్థాయిలో ఉంటుందా లేదా ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి దొంగ బిల్లులు సృష్టించాడా అని చురకలు అంటించారు. ఇక తెలంగాణా కాంగ్రెస్‌లోకి తన నమ్మకస్తులను పంపించి.. ఆ పార్టీని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీని బీజేపీలో విలీనం చేసి.. దానికి నారా లోకేశ్‌ను అధ్యక్షుడిగా నియమించేలా పథకం వేశారని ఆరోపించారు. అందుకే మొదటి నుంచీ బీజేపీ జెండా మోస్తున్న వారిని ఎదగకుండా అడ్డుకున్నారని విమర్శించారు.(చదవండి : చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి! )
Comments
Please login to add a commentAdd a comment