
రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరనున్నారు.
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శనివారం బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, షబ్బీర్ అలీతో భేటీ అయ్యారు. రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరనున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం టికెట్‌పై స్పష్టత ఇవ్వడంతో ఆయన చేరిక దాదాపు ఖరారైంది. బీజేపీ సీనియర్ నేత డీకే సమరసింహ రెడ్డి కూడా బీజేపీ గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కమళం పార్టీకి భారీ షాక్ తగిలింది.