
ఆరోగ్య రంగ పనితీరు ప్రాతిపదికపై నీతి ఆయోగ్ ఈ యేడాది ఇచ్చిన ర్యాంకుల ప్రకారం – మొత్తం 21 రాష్ట్రాల్లో రాజస్తాన్‌ది 20వ స్థానం. మధ్యప్రదేశ్ స్థానం 17. చత్తీస్‌గఢ్ (12) తెలంగాణ (11) కాస్త ముందున్నాయి. చిన్న రాష్ట్రాల్లో మిజోరం మెరుగైన పని తీరు కనబరచింది. హెల్త్ స్కోర్‌పరంగా రాజస్తాన్ ఒక్క ఉత్తరప్రదేశ్‌ను మాత్రమే అధిగమించగలిగిందని ‘హెల్తీ స్టేట్స్ – ప్రోగ్రెసివ్ ఇండియా’ శీర్షికన నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక చెబుతోంది.
రాజస్తాన్‌లో ఐదేళ్ల లోపు పిల్లల లింగ నిష్పత్తిపరంగా తీవ్ర అంతరం చోటుచేసుకుంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 887 మంది బాలికలు మాత్రమే వున్నారు (జాతీయ సగటు 919). ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 28 మంది పుట్టిన నాలుగు వారాల్లోనే మరణిస్తున్నారు (జాతీయ సగటు 24). 2010 – 17 మధ్య అదనంగా ఒక్క జిల్లా ఆసుపత్రి మాత్రమే ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. వైద్యులు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఈ కాలంలో 70 నుంచి 167కి చేరింది. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో సర్జన్ల కొరత 218 నుంచి 452కి పెరిగింది.
మధ్యప్రదేశ్‌లోనూ శిశు, ప్రసూతి మరణాలు జాతీయ సగటు కంటే ఎక్కువే. ఆరోగ్య కేంద్రాల్లో జ్యోతిష్కుల్ని నియమిస్తూ ఒక ఉత్తర్వు ఇచ్చి ఆ తర్వాత ఉపసంహరించుకుంది. శాకాహార సెంటిమెంట్‌ను ముందుకు తెస్తూ.. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లను నిషేధించింది.
చత్తీస్‌గఢ్‌లో ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో 32మంది పుట్టిన 4వారాల్లోనే చనిపోతున్నారు. ప్రసూతి మరణాలు రేటూ ఎక్కువే (ప్రతి లక్షకు 173). నిపుణుల కొరత తీవ్రంగా వున్నప్పటికీ, 2010–18 మధ్య ఇక్కడ తొమ్మిది జిల్లా ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. పీహెచ్‌సీల్లో విద్యుత్, నీటి సరఫరా కొరతను కూడా ఈ రాష్ట్రం కొద్దిమేరకు అధిగమించింది. ‘ఆయుష్మాన్ భారత్’లో భాగంగా తొలి హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటైంది ఇక్కడే.