సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ప్రజాఫ్రంట్ కూటమిని గెలిపిస్తుందన్నారు.
వివిధ జాతీయ టీవీ చానళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరిగా లేవని, ఆ సంస్థలకు రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంటుందని భావించట్లేదన్నారు. వివిధ సర్వేలు వెల్లడించిన అంశాలకు భిన్నమైన ఫలితాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలు, అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన చెప్పారు.
పీపుల్స్ ఫ్రంట్ సర్కార్ ఏర్పడుతుంది: చాడ
Published Sun, Dec 9 2018 2:01 AM | Last Updated on Sun, Dec 9 2018 2:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment