
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశ పోలింగ్ ముగిసింది. చెదురు మదురు సంఘటన తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండోవిడత ఎన్నికల్లో 95 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్ ముగిసింది. తమిళనాడు 38, కర్ణాటక 14, అసోం 5, బిహార్ 5, ఛత్తీస్‌గఢ్ 3, జమ్ముకశ్మీర్ 2, మహారాష్ట్ర 10, ఒడిశా 5, ఉత్తరప్రదేశ్ 8, మణిపూర్ 1, పశ్చిమ బెంగాల్‌లో 3 స్థానాలు సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒక స్థానానికి పోలింగ్ పూర్తయింది. తమిళనాడులో 63.73 శాతం పోలింగ్ నమోదైంది. చిదంబరం లోక్‌సభ స్థానానికి అత్యధికంగా 70.73 శాతం, కన్యాకుమారిలో అత్యల్పంగా 55.07 శాతం పోలింగ్ రికార్డ్ అయింది.
మరోవైపు తమిళనాడులోని అంబుర్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ వద్ద అన్నాడీఎంకే, ఏఎంఎంకే కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అయితే పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment