
జనగామ: నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్ కబ్జా చేశాడని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో శుక్రవారం నిర్వహించిన బూత్ కమిటీల సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో అక్రమాలు, అరాచకాలు తప్ప, అభివృద్ధి శూన్యమన్నారు. 105 సీట్లను ప్రకటించి.. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్.. మహాకూటమి పొత్తుతో హడలెత్తిపోతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment