
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఘటనను టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం బీసీలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తోందని, మండలి చైర్మన్ స్వామిగౌడ్ బీసీ అని టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్‌ఎస్ ఆడుతున్న బీసీ డ్రామా చూస్తుంటే ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు.
మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ బహిరంగంగా ప్రకటన చేసి ఇవ్వని సమయంలో బీసీలను మోసం చేసిన ఘటన గుర్తురాలేదా అని టీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని పొన్నం మండిపడ్డారు. ఉద్యమ నాయకుడిగా స్వామిగౌడ్‌పై తమ పార్టీకి గౌరవం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment