
సాక్షి, ఆచంట(పశ్చిమ గోదావరి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం మార్టేరు నుంచి 179వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వెలగలేరు క్రాస్, సత్యవరం క్రాస్, నెగ్గిపూడి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభం అవుతుంది. పెనుగొండ చేరుకుని అక్కడ ప్రజలతో వైఎస్ జగన్ మమేకం అవుతారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.
178వ రోజు ముగిసిన పాదయాత్ర
వైఎస్ జగన్ 178వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. 178వ రోజు 10.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.