
సాక్షి, పాలకొల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం పాలకొల్లు శివారు నుంచి 178వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జిన్నూరు, మట్టిపర్రు క్రాస్, బొల్లెటిగుంట, వెదంగి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. కవిటం లాకులు, కవిటం మీదుగా జగన్నాధపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
177వ రోజు ముగిసిన పాదయాత్ర
వైఎస్ జగన్ 177వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. శుక్రవారం ఉదయం నరసాపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి చిట్టివరం క్రాస్, రాజోల్ క్రాస్, దిగమర్రు, పెద్ద గరువు క్రాస్, పాలకొల్లు వరకూ వైఎస్ జగన్ పాదయాత్ర సాగింది.