
సాక్షి, అమరావతి : ‘రావలి జగన్, కావలి జగన్’ పాట యూట్యూబ్‌లో సంచలనాలను సృష్టిస్తోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. రాజకీయ ప్రచార పాటను కోటిమందికి పైగా వీక్షించడం యూట్యూబ్‌లో సరికొత్త రికార్డని తెలిపారు. ‘సోదరుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించేలోపే రాక్‌స్టార్‌ని చేశారు. సీబీఎన్‌జీ (చంద్రబాబు నాయుడు గారు) మీ నుంచి మరిన్ని విమర్శలు రాకముందే కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
The first EVER political campaign song to have crossed 10 Million views on YouTube. @ysjagan, brother, before people of AP bless you to become their CM, they have already made you the rockstar! @ncbn, Sirji, thanks in advance for no more abuses 🙏https://t.co/L0ff118Iub
— Prashant Kishor (@PrashantKishor) 30 March 2019
చదవండి...(కోటికి చేరిన ‘రావాలి జగన్ కావాలి జగన్’)
కాగా..ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్న ఎన్నికల ప్రచార వీడియో ‘రావాలి జగన్.. కావాలి జగన్’. వైఎస్సార్‌సీపీ రూపొందించిన ఈ వీడియో ఏకంగా కోటి వీక్షణలతో సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు, జగన్ వైపు అబ్బురంగా చూస్తోంది. ఒక పార్టీ ప్రచార గీతం.. అందులోనూ ఓ ప్రాంతీయ పార్టీ ప్రచార గీతం.. జాతీయ పార్టీల ప్రచార గీతాలను వెనక్కినెట్టి మరీ రికార్డు స్థాయి వ్యూవర్స్‌ను ఆకర్షించడమే దీనంతటికీ కారణం.
Comments
Please login to add a commentAdd a comment