రాజ్ ఠాక్రే-ఫడ్నవిస్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబై : సంచలన రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలిచిన మహారాష్ట్రలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఫడ్నవిస్ నివాసంలో ఠాక్రే సమావేశమయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కూటమిగా ఏర్పడ్డ శివసేనకు చెక్ పెట్టేందుకు బీజేపీ, ఎమ్‌ఎన్‌ఎస్ కలుస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రానున్న జిల్లాపరిషత్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఎమ్‌ఎన్‌ఎస్-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సమాచారం. దీనిపై చర్చించేందుకే రాజ్‌ఠాక్రే ఫడ్నవిస్‌తో సమావేశమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటి భేటీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment