
సూపర్‌స్టార్ రజనీకాంత్ (పాత ఫొటో)
సాక్షి, చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఆయన అభిమానులు భగ్గుమన్నారు. తమిళ సంవత్సరాది(ఏప్రిల్ 14)న రాజకీయ పార్టీ పేరును రజనీ ప్రకటిస్తారని భావించిన అభిమానులకు రజనీ షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 14న పార్టీ పేరును ప్రకటించడం లేదని చెబుతూ.. పార్టీ దిండిగల్ జిల్లా అధ్యక్షుడు తంబురాజ్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు రజనీకాంత్ పేర్కొన్నారు.
దీంతో ఆగ్రహించిన 146 మంది అభిమానులు రజనీ మండ్రమ్ నుంచి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.