
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ–సీ ఓటర్ ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిపిన తాజా సర్వే అంచనాల ప్రకారం... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 9 సీట్లు, కాంగ్రెస్‌కు 6 సీట్లు, బీజేపీకి ఒకటి, ఏఐఎంఐఎంకు ఒక సీటు చొప్పున దక్కనున్నాయి. రిపబ్లిక్ టీవీ ఈ సర్వే ఫలితాలను గురువారం రాత్రి వెల్లడించింది. ఈ ఎన్నికల్లో దాదాపు 35 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని చెబుతున్నా 2014 ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లకు గాను 11 సీట్లు గెలుచుకున్న టీఆర్‌ఎస్ రెండుసీట్ల మేర నష్టపోనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు ఎంపీ సీట్లు రాగా ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పెరగనున్నట్టు వెల్లడించింది. టీడీపీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కే అవకాశాలు లేవు. అయితే కాంగ్రెస్, టీడీపీ, ఇతర పక్షాలు కూటమిగా ఏర్పడడం వల్ల కాంగ్రెస్‌పార్టీ ప్రయోజనం పొందినట్టుగా అంచనావేస్తున్నారు. బీజేపీ గతంలో గెలిచిన ఒక్క సీటును నిలబెట్టుకోనుంది. అదేసమయంలో మజ్లీస్ పార్టీ ప్రభావం రాష్ట్రంలో మరి కాస్తా పెరగడంతో పాటు ఓటుశాతాన్ని కూడా పెంచుకున్నట్టుగా వెల్లడైంది.
రిపబ్లిక్ టీవీ–సీ ఓటర్ ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ అంచనాల ప్రకారం...
తెలంగాణలో గెలుచుకునే సీట్ల అంచనాలు– మొత్తం ఎంపీ సీట్లు=17
టీఆర్‌ఎస్ = 09
కాంగ్రెస్ = 06
బీజేపీ = 01
ఎంఐఎం = 01
ఇతరులు = 00
పార్టీలు సాధించే ఓట్ల శాతంపై అంచనాలు...
టీఆర్‌ఎస్ = 34.9 శాతం
కాంగ్రెస్ కూటమి = 30.3 శాతం
బీజేపీ = 19.5 శాతం
ఏఐఎంఐఎం=3.6 శాతం
ఇతరులు = 11.7 శాతం
Comments
Please login to add a commentAdd a comment