ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక తేదీ ఖరారు | RK Nagar By Poll Schedule Released | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 24 2017 10:28 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

RK Nagar By Poll Schedule Released - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు తేదీ ఖరారైంది. డిసెంబర్‌ 21న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం షెడ్యూల్‌ను ప్రకటించింది. 

డిసెంబర్‌ 21న ఎన్నిక నిర్వహించి.. 24న కౌటింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటితోపాటు సికంద్రా(యూపీ), సంబంగ్‌(పశ్చిమ బెంగాల్‌), అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పక్కే కసంగ్‌, లికబలి నియోజకవర్గాలకు అదే తేదీలో ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంది. 

కాగా, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కే నగర్‌ నియోజకవర్గ స్థానం ఖాళీ అయ్యింది.  గతంలోనే ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమవగా.. ప్రచార సమయంలో భారీ అవినీతి బయటపడటంతో ఎన్నికను రద్దు చేశారు. చివరకు న్యాయస్థానాల జోక్యంతో డిసెంబర్‌ 31లోగా ఎన్నిక నిర్వహించాలని ఈసీకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement