
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగస్తులు ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్‌ఎస్‌ఎస్ భాగస్వామ్య సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ, లేబర్ యూనియన్ చీఫ్ బ్రిజేశ్ ఉపాధ్యాయ్ అన్నారు. ప్రతి ఉద్యోగి కూడా ట్యాక్స్ విధించాలని అనుకోరని అన్నారు. 'మన దేశంలో నియమనిబంధనలు ఉద్యోగ వర్గం ట్యాక్సులు చెల్లించాలని చెబుతున్నాయి. కానీ, అలా జరగకూడదు. వ్యాపార వేత్తలు సంపాధించే ఆదాయం మాత్రమే పన్ను పరిధిలోకి వస్తుంది. సేవలు చేస్తున్నందుకు ప్రతిఫలంగా పొందుతున్న జీతభత్యాలపై ఎట్టి పరిస్థితుల్లో పన్ను విధించరాదు' అని ఆయన అన్నారు.
'భారత్‌లోని చాలామంది శ్రామికులు పేదవారు. అలాంటివారిపై అంతపెద్ద మొత్తంలో పన్ను విధిస్తే వాళ్లు ఎలా చెల్లిస్తారు. ఏం పొదుపు చేసుకుంటారు' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతకు జాతీయ ఉపాధి విధానమే లేదని గుర్తు చేశారు. 'దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయింది. ఇప్పటి వరకు ఉపాధి విధానమే లేదు. పారిశ్రామిక విధానం మాత్రం ఇప్పటికే మూడుసార్లు చేశారు.. కానీ, ఉపాధి విధానంలో మాత్రం నిర్ణయమే లేదు. ఈ రోజు దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగితే. అందుకు కారణం మనకు ఉపాధి విధానమే లేకుండా పోయింది. ఏ ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు' అని ఉపాధ్యాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment