సాక్షి, ముంబయి: మిత్రపక్షం బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్టు శివసేన స్పష్టం చేయడాన్ని బీజేపీ తేలిగ్గా తీసుకుంది. శివసేన ప్రకటన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై బీజేపీ వేచిచూసే ధోరణి అవలంభిస్తుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ‘శివసేన ఎన్నో విషయాలపై మాట్లాడుతోంది..ఏం జరుగుతుందో చూద్దాం’ అని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయరాదని, ఒంటరిగా బరిలో దిగాలని మంగళవారం శివసేన పార్టీ భేటీలో తీర్మానించిన క్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శివసేన నిర్ణయాన్ని బీజేపీ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని ఫడ్నవీస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment