సిద్దిపేట టౌన్: హరీశ్‌ను సీఎం చేయకపోతే కేసీఆర్ సంగతి చూడటానికి ఆయన వర్గం ఎమ్మెల్యే లు తల్వార్‌లు పట్టుకొని తయార్‌గా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాచైతన్య యాత్రకు వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట పట్టణ శివారు పొన్నాలలో విలేకరులతో మాట్లాడారు.
ఉద్యమంలో మామ వెన్నంటే ఉన్న హరీశ్‌రావును సీఎం రేసు నుంచి తప్పించి కొడుకును సీఎం చేయాలనే ప్రయత్నంలో భాగమే థర్డ్‌ఫ్రంట్ నాటకమని, అమెరికాలో చదువుకొని తెలంగాణకు కేటీఆర్ రాగానే మంత్రి పదవితో ముఖ్యమంతి కేసీఆర్ ఉద్యోగం కల్పించారని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావును బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడు హరీశ్‌రావు ఎమ్మెల్యేగా పనిచేశాడని, ఆయన పనితీరు చూసి సీఎం అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆనాడే చెప్పానని సర్వే వ్యాఖ్యానించారు. తానిచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే థర్డ్ ఫ్రంట్‌ను నెత్తినెత్తుకున్నారని, ఫ్రంట్‌లకు నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడే మూలకు పోయాడని ఎద్దేవా చేశారు.
ఉత్తమ్ మంచితనం పనికిరాదు..
ఉత్తమ్ కుమార్‌రెడ్డి చాలా మంచి వ్యక్తని, అలా మంచితనంతో ఉంటే రాజకీయాలలో పనిచేయదని, కేసీఆర్ లాగా తిమ్మిని బమ్మి చేసే వారే పనికొస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సర్వేల్లో కాం గ్రెస్‌కు 101 సీట్లు వస్తున్నాయని తెలిసినా 70 సీట్లే వస్తున్నాయని ఉత్తమ్ చెప్పాడని, కానీ అదే సర్వే రిపోర్టును కేసీఆర్ తీసుకొని తమకు 3 సీట్లే వస్తాయనే విషయం తెలిసినా 101 సీట్లు వస్తా యని నమ్మబలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment