సాక్షి, హైదరాబాద్: న్యాయమైన డిమాండ్లకోసం సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరపకుండా భయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వానికి మంచిదికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.
కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు జారీచేయడాన్ని ఖండించారు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పూనుకోకుండా, వారి న్యాయమైన కోరికలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి మూడేళ్ల క్రితమే హామీ ఇచ్చిన ప్రభుత్వం, వాటి అమలుకు చర్యలు తీసుకోకుండా సమ్మెను అణిచివేయాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment