టీడీపీ నాయకులను వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానిస్తున్న బుర్రా
ప్రకాశం, సీఎస్‌పురం: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వైఎస్సార్ సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎంతో మంది కీలక నేతలు పార్టీ తీర్థం పుచ్చుకోగా..ఎన్నికల దగ్గర పడటంతో ఇప్పుడు అవి మరింత ఊపందుకున్నాయి. మండల పరిధిలోని 400 కుటుంబాలకు చెందిన 2 వేల మంది కార్యకర్తలు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ మండల అధ్యక్షుడు నన్నసాని గుంటెయ్య యాదవ్, మాజీ మండల అధ్యక్షుడు చిట్టెబోయిన వెంకటేశ్వర్లు, చిట్టెబోయిన మౌలాలి, మూడమంచు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌లు కొల్లెబోయిన నారాయణ, కాకు చెంగలయ్య, కుక్కల రమణయ్య, గోగుల బాలయ్య, డేగల జానకీరాములు, తరిటి వెంకట్రావు, వేముల నారాయణ, ముడుమాల నారాయణరెడ్డి, రేగలగడ్డ చిన మాలకొండయ్య, బొడ్డుబోయిన చినలక్ష్మీనారాయణ, ఆలా చినవెంగళరావు, పసుపులేటి ప్రసాద్, సాయి, తెలగొర్ల వెంకటస్వామి, నూనె తిరుపతయ్య, నూనె పోలయ్య, దండెబోయిన తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, షేక్ చినపీరయ్య, నాయబ్ రసూల్, రంతుల్లా, సూరెబోయిన పెద వెంకటయ్య, నన్నసాని మోహన్‌రావు, అరవా నారాయణ, ఎలికా వెంకటేశ్వర్లు, కామాయపల్లి రామయ్య, అంగిరేకుల శేషాద్రి తదితర నాయకులు పార్టీలో చేరారు.
వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కొండ్రాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ లాయర్ షేక్ గఫూర్, వైఎం ప్రసాదరెడ్డి (బన్నీ), నరాల రమణారెడ్డి, వైద్యులు మురళీకృష్ణ, పులి రాధాకృష్ణారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శులు పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, దుగ్గిరెడ్డి జయరెడ్డి, సిద్ధమూర్తి మల్లికార్జునరెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ బుజ్జి, జిల్లా యూత్ కార్యదర్శి వీరంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పందిటి వెంగళరావు, ఎంపీటీసీ సభ్యుడు మితికేల గురవయ్య, మాజీ ఎంపీపీ భువనగిరి వెంకటయ్య, వివిద విభాగాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment