‘పవన్‌పై పోటీచేసి సత్తా చూపిస్తా’ | Tdp Mla prabhakar chowdary comments pawan kalyan | Sakshi
Sakshi News home page

‘పవన్‌పై పోటీచేసి సత్తా చూపిస్తా’

Published Fri, Mar 16 2018 12:51 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Tdp Mla prabhakar chowdary comments pawan kalyan - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బీజేపీ చేతుల్లో ఉన్నారనే విషయాన్ని మూడు నెలల క్రితమే చెప్పానని టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి తెలిపారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ప్రస్తుతం వామపక్షాలు జనసేనాని వెనుక బీజేపీ ఉందనే విషయాన్ని గమనించలేకపోతున్నాయన్నారు. చంద్రబాబు తర్వాత తానే ప్రత్యామ్నాయామని పవన్ భావిస్తున్నారని, అందుకే లోకేష్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

మరో వైపు పవన్‌ కల్యాణ్‌ మీపైనే పోటీకి రాబోతున్నారంటూ ప్రభాకర్‌ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అనంతపురం నుంచి పవన్‌ తనపై పోటీకి వస్తానంటే స్వాగతిస్తానన్నారు. అంతేకాకుండా ఆయనపై పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని ప్రభాకర్‌ చౌదరి వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement