
సాక్షి, అమరావతి: కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పేరును టీడీపీ ఖరారు చేసింది.సోమవారం రాత్రి కేఈ ప్రభాకర్ పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. అనంతరం మంత్రులు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ అందరితో సంప్రదింపులు జరిపి ప్రభాకర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా రాజకీయ అవసరాలు, అక్కడ నాయకుల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం జరిగినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment