
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ కూటమిని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమత బెనర్జీతో భేటీ అయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన.. మరికాసేపట్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై మాయావతి, అఖిలేశ్‌తో చర్చల అనంతరం.. పలు జాతీయ సంఘాల ప్రతినిధులతోనూ కేసీఆర్ చర్చిస్తారు. ఇక, హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని కేసీఆర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment