ఆదిలాబాద్: తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పట్టిందని, ఓటు వేసే ముందు ప్రజలు కాస్త సోయితో వేయాలని తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ..58 ఏండ్లు పాలించిన పార్టీలు ఒకవైపు, 15 ఏండ్ల పోరాటం చేసి నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్‌ఎస్ ఒక వైపు ఉన్నాయని, ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటు హక్కును టీఆర్‌ఎస్‌కు వేయాలని కోరారు. కాపలా కుక్కలా పనిచేస్తేనే నిరంతర విద్యుత్ సాధ్యమవుతుందని, ఈ టర్మ్ ప్లానింగ్‌కే సరిపోయిందని అన్నారు. ఆదిలాబాద్‌లో అధికారుల యంత్రాంగాన్ని తీసుకొచ్చి 3 రోజులుండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ముస్లిం, గిరిజన జనాభా రాష్ట్ర విభజన అనంతరం పెరిగిందని తెలిపారు. అందుకే రిజర్వేషన్లు పెంచమని కోరామని, కానీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది..తెలంగాణ ఏమైనా మోదీ, అమిత్ షాల జాగీరా అని సూటిగా ప్రశ్నించారు. 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది..ఒక్క రాష్ట్రంలోనైనా నిరంతర విద్యుత్, రైతు బంధు, పెన్షన్లు ఇస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. 25 ఏండ్ల క్రితం పేదరికంలో ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే అభివృద్ధిలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. విద్య, వ్యవసాయ, ఆరోగ్య శాఖలపై కేంద్రం పెత్తనం ఏంటని సూటిగా అడిగారు. 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండవద్దు అనే సుప్రీం కోర్టు తీర్పు తప్పు.. రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50 శాతానికి మించి ఇవ్వవద్దు అని రాసి లేదని వ్యాఖ్యానించారు.
నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరారు. కంటి వెలుగు దేశంలో ఎక్కడైనా అమలు అవుతుందా అని ప్రశ్న లేవనెత్తారు. బీజేపీ వాళ్లు ఊరికే వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా మొత్తం తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. రైతులు పండించిన పంటలు, పండ్లు, కూరగాయలు ఎక్కడో అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా తాలూకాకి రెండు మూడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెడతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ బ్రతికున్నంత వరకు ఈ స్కీములు అన్నీ కొనసాగుతాయని చెప్పారు.
58 ఏళ్లు పాలించిన పార్టీలు ఒక వైపు..
Published Thu, Nov 29 2018 2:42 PM | Last Updated on Thu, Nov 29 2018 7:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment