
జగిత్యాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ రామ్మోహన్ రావు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు శుక్రవారం జగిత్యాలలో పర్యటించారు. అక్కడి కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా, జాయింట్ కలెక్టర్ రాజేశం స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వీఆర్‌కే కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
స్ట్రాంగ్ రూం నుంచి నేరుగా కౌంటింగ్ హాలుకు వచ్చే దారిని పరిశీలించారు. అలాగే ఒక హాలులో 18 టేబుళ్లు చొప్పున జగిత్యాలకు రెండు హాళ్లను, కోరుట్లకు రెండు హాళ్లను పరిశీలించారు. కౌంటింగ్ వివరాలు ఏజెంట్లకు తెలుపడానికి ఏర్పాటు చేసిన టీవీలు, ఏర్పాట్లను చూసి సంతృప్తి చెందారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఎస్పీ సిందూశర్మ, సబ్ కలెక్టర్ గౌతమ్, డీఆర్వో అరుణ, ఇతర అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment