
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా అంశాలపై సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయని, జాబితాపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం కాలేదని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీవీ న్యూస్ ఛానల్స్, సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో వస్తోన్న జాబితాలు నిజం కాదని, ఇంకా ఎటువంటి జాబితా సిద్ధం కాలేదని ఉత్తమ్ వెల్లడించారు. ప్రచారంలో ఉన్న జాబితాలు నిజం కాదని, అవి ఊహాజనీతం, కల్పితం మాత్రమేనని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు వాటిని నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు(శుక్రవారం) విడుదల చేస్తామని వివరించారు. అధికారికంగా జాబితా విడుదల అయ్యే వరకు ఎలాంటి జాబితాలు నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని ఉత్తమ్ వ్యాక్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment