సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్ల పేరిట నక్సలైట్లను కాల్చి చంపేవారని.. సీఎం కేసీఆర్ కూడా అప్పటి చంద్రబాబు పాలననే కొనసాగిస్తున్నారని తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ఆరోపించింది. ‘రక్తపు మరకలు, పోలీసు బూట్ల చప్పుడు లేని తెలంగాణ’అని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు.
అయితే అధికారం చేపట్టిన నాటి నుంచే రక్త దాహంతో ప్రతీకారం తీర్చుకుంటూ చంద్రబాబు పాలననే కేసీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, మనిషిని మనిషే చంపుకునే సంస్కృతి పోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment