కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ఓ దొంగల ముఠా అని.. నాలుగున్నరేళ్లలో దోపిడీ చేసిన ప్రజాధనంతోనే తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టుల్లో భారీ దోపిడీ జరిగిందని.. కేసీఆర్, కేటీఆర్ 6 శాతం చొప్పున కమీషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు. ఆదివారం గాంధీభవన్‌లో ఉత్తమ్ సమక్షంలో పీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నేత భీమ్ భారత్ నేతృత్వంలో పలువురు మాజీ మవోయిస్టులు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఉత్తమ్ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కుమ్మక్కై.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గట్టెక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ‘తెలంగాణలో ఎన్నికలు టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు. కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ సమాజం. సీఎం కుటుంబం తెలంగాణ ముసుగు వేసుకుని.. ధన, అధికార దాహాన్ని తీర్చుకుంది. తెలంగాణలో ప్రజాస్వామ్య సంస్థలతోపాటు మీడియాను భయపెడుతోంది’ అని ఉత్తమ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ప్రతి పౌరు డు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘ఇది అందరికీ పరీక్షా సమయం. 53 రోజుల్లో తెలంగాణ భవిష్యత్ తేలనుంది. సామా జిక న్యాయమే కాంగ్రెస్ మూల సిద్ధాంతం. దీని అమలు కోసమే మా పోరాటం’ అని అన్నారు.
కళ్లు నెత్తికెక్కాయ్
కేసీఆర్, కేటీఆర్‌లకు అధికార మదం నెత్తికెక్కి.. అహంకారంతో మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కేటీఆర్ తన తండ్రిని ఇందిరాగాంధీతో పోల్చ డం హాస్యాస్పదమన్నారు. ‘ఇందిర, కేసీఆర్‌ల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. ఒకరు దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ధీర వనిత అయితే.. కేసీఆర్ దగుల్బాజీ’అని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ కు ద్రోహం చేసిందీ.. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిం దీ కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. శాసనసభ రద్దయిన రోజు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటన్న కేసీఆర్.. ఇప్పుడు కూటమిని చూసి భయపడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమ ర్శించారు. తలసాని, తుమ్మల, మహేందర్ రెడ్డి ఏ ఉద్యమంలో పాల్గొన్నందుకు మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఉత్తమ్ ప్రశించారు. డబుల్ బెడ్‌రూమ్, దళితులకు 3 ఎకరాలు ఇవ్వనందుకే కేసీఆర్‌కు ఓటే యాలా అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment