
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలంటే మేధావులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించాలన్నారు. అదేరోజు జరిగే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఏఐసీసీ అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సభ్యత్వ నమోదుపై చర్చిస్తామన్నారు.