ఈ 20 జీవోలే సాక్ష్యం: విజయసాయిరెడ్డి | Vijaya Sai Reddy Slams Chandrababu Over PD Act | Sakshi
Sakshi News home page

ఈలోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు!

Published Sat, Jan 18 2020 12:20 PM | Last Updated on Sat, Jan 18 2020 12:26 PM

Vijaya Sai Reddy Slams Chandrababu Over PD Act - Sakshi

సాక్షి, అమరావతి: పీడీ యాక్ట్‌ను పొడగిస్తే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన బ్యాచ్‌ గుడ్డలు చించుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు.... ‘2014-19 మధ్య 20 సార్లు తాము పొడిగించిన పీడీ యాక్టును, ఇప్పుడు రొటీన్‌గా మా ప్రభుత్వం పొడిగిస్తే.. బాబు, ఆయన బ్యాచ్ ఎలా గుడ్డలు చించుకుంటున్నారో చెప్పేందుకు ఈ 20 జీవోలే సాక్ష్యం!’ అని ట్వీట్‌ చేశారు. ఇందుకు పాత జీవోల ఫొటోలను జతచేశారు.

చదవండి: 'సున్నా'తో పెట్టుకుంటే మిగిలేది అదే

అదే విధంగా రాజధాని అంశంపై చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలను విజయసాయిరెడ్డి ఎండగట్టారు. ‘10 లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద హుష్ కాకి అవుతుందనే టెన్షన్ ముందు సంక్రాంతి పండుగ ఎంత. డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు, ఆయన వర్గీయుల ప్రగాఢ విశ్వాసం. ఈలోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు. తటస్థులను తెరపైకి తెస్తాడు. దేనికైనా సిద్ధమే విజనరీ!’ అని ఎద్దేవా చేశారు. ‘మనమంతా జాతీయ నాయకులను, సమున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను గౌరవిస్తాం. స్మరించుకుంటాం. చంద్రబాబుకు ఆ అలవాటే లేదు. ఆయన ఆరాధించేది ప్రపంచ కుబేరులైన బిల్ గేట్స్, వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్ లాంటి వారినే. తనూ ఆ స్థాయికి ఎదగాలని అవినీతి మార్గాన్ని ఎంచుకున్నాడు’ అని ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చదవండి: పళ్లు కొరికారు.. శాపాలు పెట్టారు.. ఆఖరికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement