త్వరలోనే జిల్లాలో విజయశాంతి పర్యటన | Vijaya Santhi Tour In The District Soon | Sakshi
Sakshi News home page

త్వరలోనే జిల్లాలో విజయశాంతి పర్యటన

Published Sat, Jun 16 2018 9:46 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

Vijaya Santhi Tour In The District Soon - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న సుప్రభాతరావు చౌదరి 

హవేళిఘణాపూర్‌(మెదక్‌) : త్వరలోనే మాజీ ఎంపీ విజయశాంతి మెదజ్‌ జిల్లాలో పర్యటించనున్నారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు చౌదరి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తొగిట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయశాంతి పర్యటించనున్నారన్నారు.

వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ట్రాక్టర్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రైతుబంధు పథకం కేవలం భూస్వాముల పథకంగా మారిందని, భూయాజమానికి ఎకరానికి రూ. 4వేలు ఇస్తే మరి కౌలు రైతు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు నిజాం దక్కన్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వాధీనం చేస్తామన్న హామీ ఏమైందన్నారు. ఓ వైపు ఎన్‌డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీ కార్మికులను రోడ్డున పడేస్తు మరోవైపు టీఆర్‌ఎస్‌ హయంలోనే గ్రామాభివృద్ధి జరుగుతుందని డప్పు కొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నాయకులు సిరిమల్లె శ్రీనివాస్, ఆఫీజోద్దీన్, రమేష్‌రెడ్డి, కిషన్‌గౌడ్, శంకర్, లక్ష్మినారాయణ, దుర్గయ్య తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement