
సాక్షి, అమరాతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు తన 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఒక్కసారి కూడా సొంతంగా గెలవలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ - ఒక్కసారి సొంతంగా గెలవలేదు. 2019 ఒంటరి పోరులో అసలు బలం తేలిపోయింది. వేరేవారి భుజంపై తుపాకి పెట్టి కాల్చాలనే పాత ఫార్ములా వదలడు. ఎన్నికల ముందు మోదీ భార్య, తల్లిపైనా వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఇప్పుడు మనుషుల్ని పంపి కాళ్లబేరాలాడుతున్నా ఫలితం లేదు’. అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. (12 కోట్ల కొనుగోళ్లలో రూ.5 కోట్ల అవినీతి!)
‘పీపీఏలను సమీక్షిస్తామంటే అలా చేస్తే పెట్టుబడులు రావంటూ చంద్రబాబు దొర్లి దొర్లి ఏడ్చాడు. ఇవ్వాళ 8 రాష్ట్రాలు మన దారిలో నడుస్తున్నాయి. తాజాగా గుజరాత్ కూడా సవరణకు సిద్ధపడింది. చౌక కరెంటు కొనుగోళ్లతో 8 నెలల్లోనే 6 వేల కోట్ల ప్రజాధనం ఆదాచేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడ ఉన్నారు.’ అంటూ విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. (వ్యవస్థలను నాశనం చేయడం మీకు కొత్త కాదుగా!)
40 ఇయర్స్ ఇండస్ట్రీ - ఒక్కసారీ సొంతంగా గెలవలేదు. 2019 ఒంటరి పోరులో అసలు బలం తేలిపోయింది. వేరేవారి భుజంపై తుపాకి పెట్టి కాల్చాలనే పాత ఫార్ములా వదలడు. ఎన్నికల ముందు మోదీ భార్య, తల్లిపైనా వ్యక్తిగత విమర్శలు చేశాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 16, 2020
ఇప్పుడు మనుషుల్ని పంపి కాళ్లబేరాలాడుతున్నా ఫలితం లేదు.