మార్ఫింగ్ ఫొటో, అసలు ఫొటో
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ ఫొటో చూశారా.. ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తల్లి సోనియాకు పాదాభివందనం చేస్తున్నట్టుంది కదూ. అంతేకాదు.. ఆ ఫొటో పైన ‘రూ.72 వేల గురించి, 22 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడొద్దని దయచేసి మీ అబ్బాయికి చెప్పండి. లేకపోతే నేను మళ్లీ గుజరాత్ వెళ్లిపోవాలి.. ఇక అక్కడ నా కోతల్ని (జుమ్లీ) నమ్మేవాళ్లెవరూ లేరు’ అన్న వ్యాఖ్య కూడా ఉంది. ‘అదేంటి.. మోదీ ఏంటి? సోనియాకు ప్రణమిల్లడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. అదే మరి టెక్నాలజీ మాయాజాలం.
మీరు చూస్తున్నది మోదీ, సోనియాల ఫొటోనే అయినా అది అసలు ఫొటో కాదు. మార్ఫింగ్ చేసిన ఫొటో. 2013, సెప్టెంబర్ 26న భోపాల్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో మోదీ అడ్వాణీ కాళ్లకు నమస్కరించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోను మార్చి ఇలా తయారు చేశారు. అడ్వాణీ స్థానంలో సోనియా ఫొటో అతికించారు. మోదీ సోనియాకే కాదు.. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, సౌదీ రాజు కాళ్లకు మొక్కుతున్నట్టు కూడా మార్ఫింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment