అధికారంలోకి వస్తే 100 రోజుల్లో హోదా సాధిస్తాం | We Achieve Special Category Status Within 100 Days If We Get Power said By YV Subba Reddy | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే 100 రోజుల్లో హోదా సాధిస్తాం

Published Tue, Jul 24 2018 11:49 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM

We Achieve Special Category Status Within 100 Days If We Get Power said By YV Subba Reddy - Sakshi

చంద్రబాబుకు చిత్తశుద్ధే ఉంటే ప్రత్యేక హోదా కోసం బంద్‌ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు

సాక్షి, ఏలూరు: వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్‌లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్ధతు ఇస్తామని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రజలను సీఎం నారా చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.

చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధే ఉంటే ప్రత్యేక హోదా కోసం బంద్‌ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని చిత్తశుద్ధితో వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసి ఆమోదింప చేసుకున్నారని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చెయ్యాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement