కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వాలు చేస్తున్న పని ప్రజలకు తెలియజేస్తూ.. ప్రజల వద్దకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల కోసం ప్రభుత్వాలను ప్రశ్నిస్తామన్నారు. 70 సంవత్సరాలుగా సామరస్యం కాపాడుతూ.. ప్రజల అవసరాల కోసం చట్టాలు చేస్తూ సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందనిచెప్పుకొచ్చారు.
ఆర్థికంగా,రాజకీయంగా అన్ని కులాలను బలోపేతం చేసే లక్ష్యంతో తమ పార్టీ ముందుకు సాగుతోందన్నారు. మానవ హక్కులను కాపాడటానికి అధికారంలో ఉన్నా లేకున్నా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.అన్ని వర్గాలకు ఆత్మబంధువుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment