న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో భిన్న వ్యూహాలు అమలుచేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఇందుకోసం బీజేపీకి వ్యతిరేకంగా అన్ని స్థానాల్లో ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టబోతున్నట్లు సంకేతాలిచ్చింది. రాబోయే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు కసరత్తును ప్రారంభించిన ఆ పార్టీ..ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అనధికార చర్చలు ప్రారంభించింది. పార్టీ విశ్వసనీయ వర్గాల ప్రకారం..ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమిటీలు ప్రతి నియోజకవర్గంలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని గుర్తిస్తాయని తెలిసింది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ బేషజాలకు పోకూడదని పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment