‘కాంగ్రెస్‌కు ఓటేసే వాళ్లు రావణుడి భక్తులు’ | Yogi Adityanath Claims Only A Ravana Bhakt Would Vote For Congress | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 28 2018 4:13 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Yogi Adityanath Claims Only A Ravana Bhakt Would Vote For Congress - Sakshi

జైపూర్‌ : రామ భక్తులు బీజేపీకి ఓటేస్తారు.. రావణుడి అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌కి ఓటేస్తారంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. ఈ సందర్భంగా రామాయణాన్ని మరోసారి తెర మీదకు తెచ్చారు. ‘హనుమాన్‌ గిరిజనుడు. అడవుల్లోనే తిరిగారు. రాముని కోరిక మేరకు హనుమంతుడు నలుదిక్కులను ఏకం చేసి ఈ అఖండ భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేశారు. ఇప్పుడు మేము కూడా ఈ ఆశయాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నామం’టూ యోగి వ్యాఖ్యానించారు.

అంతేకాక రాముడిని కొలిచేవారంతా బీజేపీకి ఓటేస్తారని.. రావణాసురిని అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేస్తారని యోగి ఆరోపించారు. రాజస్తాన్‌లో ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఓ వైపు యోగి హిందువులను, దళిత ఓటర్లను ఆకర్షించే పనిలో ఉండగా.. మరోవైపు మోదీ అభివృద్ధి తనవల్లే సాధ్యమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement