రాష్ట్రంలో రాక్షస పాలన | YS Avinash Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాక్షస పాలన

Published Tue, Oct 23 2018 2:15 PM | Last Updated on Tue, Oct 23 2018 2:15 PM

YS Avinash Reddy Slams Chandrababu Naidu - Sakshi

నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తున్న మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా  వేంపల్లె : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన రాక్షస పాలనను తలపిస్తోందని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తీవ్రం గా విమర్శించారు.ఈ ప్రభుత్వ హయాంలో  ఏ ఒక్క వ ర్గానికి మేలు  జరగలేదని పేర్కొన్నారు. జగనన్న ముఖ్య మంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ చం ద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ రవికుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో వేంపల్లె క్రిస్టియన్‌ కాలనీలో సోమవారం ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు  మాజీ ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులకు నవరత్నాల గురించి వివరించారు.  

మాజీ ఎంపీ దృష్టికి సమస్యలు : స్థానిక క్రిస్టియన్‌కాలనీలో  సమస్యలునెలకొన్నాయని  మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి కాలనీ వాసులు మొర పెట్టుకున్నారు.   తాము వైఎస్సార్‌సీపీ మద్దతుదారులుగా ఉన్నామని.. పక్కాగృహాలు కూడా మంజూరు చేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని  తెలిపారు. ఈ సందర్భంగా   వైఎస్‌ అవినాష్‌రెడ్డి  మాట్లాడుతూ జగనన్నను ఆశీర్వదించాలని, ఆయన ముఖ్యమంత్రి అయితే అందరి కష్టాలు తీరుతాయన్నారు.

పులివెందుల నియోజకవర్గంలో బీద సోదరులపై టీడీపీ నాయకుల ఆరాచకాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అసలు మీటర్లే లేవని.. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఇంటికి విద్యుత్‌ మీటర్లు అమర్చి ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఎస్సీ, ఎస్టీ కులాలకు 200యూనిట్ల వరకు విద్యుత్‌  ఉచితంగా అందజేస్తారన్నారు. మీరు అధైర్యపడొద్దని.. జగనన్న తోడుగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.  కార్యక్రమంలో జెడ్పీటీసీ షబ్బీర్‌వల్లి, మాజీ ఎంపీపీ కొండయ్య, మైనార్టీ కన్వీనర్‌ మునీర్, మండల బూత్‌ కమిటీ మేనేజర్‌ ఆర్‌.శ్రీను, మండల యూత్‌ కన్వీనర్‌ రవిశంకర్‌ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్‌.వేణు, జిల్లా యూత్‌ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణరెడ్డి, జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి గంగాధర యాదవ్, సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, నాయకులు నిస్సార్‌ బాషా, కాలేషా, ఆర్‌ఎల్‌వి ప్రసాద్‌రెడ్డి, బి.ప్రతాప్‌రెడ్డి, రామగంగిరెడ్డి, ఎంపీటీసీలు రెడ్డయ్య, చంద్రశేఖర్, గంగరాజు, టోపివలిల తదితర నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement