రేపు వైఎస్‌ జగన్‌ నామినేషన్‌ | YS Jagan Likely To File Nomination On Friday In Pulivendula Over AP Elections 2019 | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్‌ నామినేషన్‌

Published Wed, Mar 20 2019 8:29 PM | Last Updated on Thu, Mar 21 2019 4:02 AM

YS Jagan Likely To File Nomination On Friday In Pulivendula Over AP Elections 2019 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22వ తేదీన పులివెందుల శాసనసభ నియోజక వర్గం నుంచి తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్‌ కోసం పార్టీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా వైఎస్‌ జగన్‌ గురువారం పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో సమావేశమై సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో మేనిఫెస్టో తుది ముసాయిదాపై కసరత్తు జరగనుంది. ఈ కారణంగా గురువారం జగన్‌ ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

చదవండి : హైదరాబాద్‌ నుంచి ఎందుకు పారిపోయావు బాబు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement