
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో వివరిస్తూ దేశ ప్రథమ పౌరుడికి లేఖ పంపారు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని సవివరంగా లేఖలో వివరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ నుంచి స్పందన రాలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అన్నది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. గడచిన 41 నెలల్లో 1,09,422 కోట్ల రూపాయల అప్పులు చేశారని వెల్లడించారు. శాసనసభ సమావేశాలను అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహిస్తున్నారని, సభలో విపక్షం గొంతు వినపడకుండా నొక్కేస్తున్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న ప్రజాస్వామ్య అపహాస్యాన్ని అడ్డుకోవాలని లేఖలో రాష్ట్రపతిని వైఎస్ జగన్ కోరారు. చంద్రబాబు సర్కారు అక్రమాలు, అరాచకాలను ప్రస్తావిస్తూ రాష్ట్రపతికి ఆయన 5 పేజీల లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment