
సాక్షి, హైదరాబాద్ : ఉగాది పర్వదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం పది గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మ‍్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 8:15 నిమిషాలకు ‘ఉగాది ఆస్థానానికి చేరుకోవటం, తదుపరి గురు వందనం, పంచాంగానికి అర్చన, పంచాంగ శ్రవణం, వేదస్వస్తి, ఉగాది ప్రసాదం స్వీకరించటం, ఆఖరిలో పండిత సత్కారం’ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఉగాది పూజా కార్యక్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని, అనంతరం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు. ఈ ఉగాది వేడుకల్లో పార్టీ నేతలంతా పాల్గొనాలని ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలోని కమిటీ మ్యానిఫెస్టోను రూపొందించింది. నవరత్నాలతో పాటు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను ఈ మ్యానిఫెస్టోలో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment