
ఎండీ ఇక్బాల్ (ఫైల్ ఫోటో)
ముస్లింలు ఆర్థికంగా ఎదగకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని...
సాక్షి, కృష్ణా : హజ్ యాత్రికుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి అవమానకరంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన హజ్ యాత్రికులను చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని పార్టీ స్లోగన్స్ చదవించడం సరికాదని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు చోటివ్వలేదని, ముస్లింల పట్ల చంద్రబాబుకు చులకన భావమని మండిపడ్డారు. ముస్లింలు ఆర్థికంగా ఎదగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు.
‘అక్రమ మైనింగ్‌పై ఎవరు ప్రశ్నించినా కేసులు పెడుతున్నారు. దోషులను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?. 10 రోజుల తరువాత వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ మైనింగ్ ప్రాంతానికి వెళ్తుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చి పారదర్శకంగా వ్యవహరించాలి. నాలుగేళ్లుగా చంద్రబాబు చెప్పిందే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. వైఎస్ జగన్‌పై పెట్టిన అక్రమ కేసులపై పవన్‌కు అవగహన లేదు. ప్రభుత్వంతో అంటకాగిన పవన్‌పై క్విడ్ ప్రోకో కేసు పెట్టొచ్చు కాదా? కాపు రిజర్వేషన్ల్‌పై పవన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.