
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ‍్వజమెత్తారు. మంగళవారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ఆయన ... జయదేవ్ మీద భూకబ్జా కేసులున్నాయని ఆరోపించారు. ఓట్లు గుంటూరువి.. నోట్లు మాత్రం చిత్తూరుకా అని మండిపడ్డారు. ఇక మంగళగిరి అని స్పష్టంగా పలకలేని నారా లోకేష్.. మంగళగిరి టీడీపీ అభ్యర్థా అని ప్రశ్నించారు. చంద్రబాబు మీడియా సాక్షిగా ఎన్టీఆర్‌ను వాడు అన్నాడంటే.. రూమ్‌లో ఇంకేం మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చని మోదుగుల అన్నారు.
ఆంధ్రజ్యోతి దినపత్రికకు జ్యోతి లక్ష్మీగా పేరు మారిస్తే బాగుంటుందని మోదుగుల ఎద్దేవా చేశారు. రాధాకృష్ణ.. జ్యోతి లక్ష్మీ భంగిమలా ఎన్ని మాటలైన మాట్లాడతాడని ఆయన మండిపడ్డారు. టీడీపీకి చంద్రబాబు, లోకేష్‌లు నాయకులుగా పనికిరారన్నారు. మీ పార్టీకి నాయకులను మార్చుకోండి అంటూ టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు అభివృద్ధి కోసం ఏమేమి పనులు చేపట్టాలో తెలిపేలా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిందని మోదుగుల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment