నిరసన తెలుపుతున్న వైఎస్సార్ ఎస్‌యూ నాయకులు
అనంతపురం: వైఎస్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఎస్‌ఐలు శివగంగాధర్‌రెడ్డి, శ్రీరామ్, సిబ్బంది అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి జీపులో తరలిస్తుండగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసు వాహనం కార్యకర్తలపై దూసుకెళ్లింది. ఆగ్రహానికి గురైన నాయకులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆందోళనకారులను పోలీస్‌స్టషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు మీడియాతో మాట్లాడారు. ఎస్టీలు పిట్‌పాకెట్లు కొట్టేవాళ్లని చెప్పడం జేసీ అహంకారానికి నిదర్శనమన్నారు. దివాకర్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నట్లు తెలిపారు.
వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత జేసీకి లేదన్నారు. నిన్ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ రాజారెడ్డి కాళ్లు పట్టుకున్న సంగతి మరిచిపోయావా...? అని ప్రశ్నించారు. గతంలో తాడిపత్రిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు పరిటాల సునీత వస్తే ఆందోళన చేశారని, ఈరోజు అలాంటి వారి పంచన చేరి సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. మరోసారి వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నేతలను పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి పరామర్శించారు. ఆందోళనలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, కార్పొరేటర్లు జానకి, గిరిజమ్మ, మíßహిళా విభాగం నాయకురాళ్లు కొండమ్మ, భారతి, ఉషా, పార్టీ నాయకులు కనకరాం, నరేష్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, వడ్డే రామచంద్ర, సాకే చంద్ర, సైఫుల్లా, ఫకృద్దీన్, హనుమంతు, దిలీప్‌రెడ్డి, నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, మోహన్ పాల్గొన్నారు.
జగన్ జోలికి వస్తే నాలుక కోస్తాం
వైఎస్ కుటుంబాన్ని గానీ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను గాని వ్యక్తిగతంగా విమర్శిస్తే నాలుక కోస్తామని ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి హెచ్చరించారు. జేసీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట విద్యార్థి విభాగం నాయకులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేసీ సోదరులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నరేంద్రరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు వద్ద లబ్ధిపొందాలనుకుంటే నాలుగు గోడల మధ్య కాళ్లు పట్టుకోవాలని సూచించారు. గద్వాల్‌లో దొంగతనాలు చేస్తుంటే అక్కడ తరిమికొడితే జూటూరుకు వచ్చిన జేసీ.. ఇక్కడి రైతుల భూములు లాక్కున్నారన్నారు. జేసీ అరాచకంతో తాడిపత్రి నియోజకవర్గంలో తాళులు తెగిన మహిళలను అడిగితే జేసీ దివాకర్‌రెడ్డి చరిత్ర తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం సుధీర్‌రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు వాసగిరి నాగ్, జిల్లా ప్రధానకార్యదర్శి మాధవరెడ్డి, నాయకులు షాషు, కుళ్లాయిస్వామి, కార్తీక్‌రెడ్డి, నవీన్‌యాదవ్, మనోజ్, మహేష్, ప్రసాద్, ఇంతియాజ్, యాసిన్ పాల్గొన్నారు.
ఎరుకల కులస్తులకు క్షమాపణ చెప్పాలి
సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎరుకలను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని, వెంటనే ఆయన ఎరుకల కులస్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి సాకే చిరంజీవి డిమాండ్ చేశారు. ఎరుకల కులస్తులకు చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో ఎరకుల ముద్దుబిడ్డ రాగాల వెంకటరాహుల్ బంగారు పతకం సాధించి దేశానికి, ఎరుకల కులస్తులకు కీర్తిప్రతిష్టలు సంపాదించి పెట్టారని గుర్తు చేశారు. ఎరుకుల కులస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన జేసీపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు పెడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment