
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ( పాత ఫోటో)
సాక్షి, అమరావతి : ముస్లిం యువకులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.హామిలను నెరవేర్చమని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించడం దారుణమన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం కనీసం నిరసన తెలిపే స్వాతంత్య్రం కూడా లేదా అని ప్రశ్నించారు. వారి హక్కులను అడిగే బాధ్యత మస్లిం యువకులపై ఉందన్నారు.
శాంతియుతంగా ప్లకార్టులు ప్రదర్శించడం నేరమా అని ప్రశ్నించారు. 2014లో ముస్లీంలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. నారా హమారా, టీడీపీ హమారా పేరుతో ముస్లింలను మరొసారి మభ్యపెట్టేందుకు కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.నారా హమారా నహీ అని.. నారా హఠావో.. ముస్లిం బచావో అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment