
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సంక్రాంతి పండుగ రోజు మందడంలో చంద్రబాబు కుటుంబం రైతుల దీక్షకు మద్దతు తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
'పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారంతా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం కష్టమని చంద్రబాబు నాయుడి కుటుంబం మాత్రమే సంబరాలకు దూరంగా ఉండి పోయింది. పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదు' అని విజయసాయి రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా మరో ట్వీట్‌లో.. 'ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా చంద్రబాబూ? భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్‌ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమా? రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టుకుని వసూళ్ల యాత్రలు అవసరమా? 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ?' అంటూ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment